Bandi Sanjay: బెంగాల్, తమిళనాడు ఎన్నికల తరువాత బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపైనే దృష్టి సారించబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ గెలుపుతో ‘‘కాంగ్రెస్ ముక్త్ భారత్’’ లక్ష్యాన్ని సంపూర్ణం చేస్తామన్నారు. ఈరోజు కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీజేపీ నాయకులను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు. బీజేపీ కార్యకర్తల…