తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం 3:30 గంటలకు రిజల్ట్స్ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఎంజీ వర్సిటీ ఇంఛార్జి విసి నవీన్ మిట్టల్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 96.90 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు.