దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ చేపట్టిన "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్"లో భాగంగా గత సంవత్సరం నుంచి భారత రాష్ట్రపతి కార్యాలయ ఆధ్వర్యంలో ఈ వివిధతకా అమృత్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్లు.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. భారతదేశంలోని సాంస్కృతిక, భాషా, సంప్రదాయ వైవిధ్యాన్ని పురస్కరించుకుంటూ "భిన్నత్వం లో ఏకత్వం" అనే స్ఫూర్తిని…