కరోనా మహమ్మారి మరోసారి తెలంగాణలో విజృంభిస్తోంది. గత మూడు రోజుల నుంచి సెంచరీ కొట్టిన కరోనా కేసులు సంఖ్య.. తాజాగా డబుల్ సెంచరీ కొట్టింది. గడిచిన 24 గంటల్లో 22,662 కరోనా పరీక్షలు నిర్వహించగా, 219 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 164 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. రంగారెడ్డి జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 కేసులు చొప్పున కరోనా కేసులు నమోదుయ్యాయి. అలాగే ఒక్కరోజు 76 మంది…