Congress : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు అని తెలిపారు. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు శుభాభినందనలు చెప్పారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు.
టీఆర్‌ఎస్ పార్టీ అధినేక కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన తనయుడు, మంత్రి కేటీఆరే అవుతారని ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీ నేతలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని టీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు.