పెద్దవాళ్ల దగ్గర ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే.. ఏంటా కుప్పిగంతులు అంటారు. అదే ఓ స్థాయిలో ఉన్నవాళ్లు చేస్తే.. అంతా నవ్వి పోతారు. హస్తినలో ఆ పార్టీ నేతలు చేసిన పని అలాగే ఉందట. పెద్దాయన దృష్టిలో పడేందుకు.. మార్కులు కొట్టేసేందుకు తెగ తాపత్రయ పడ్డారట. అమిత్ షా చిరు నవ్వులు చూడగానే నేతలు అడ్వాన్స్ అయ్యారా? ముఖ్య నేతలంతా ఢిల్లీ రండి.. అమిత్ షా మాట్లాడతారని కబురు వెళ్లడంతో.. హస్తినలో వాలిపోయారు తెలంగాణ బీజేపీ నేతలు.…