‘విలువలు లేని తమకే ఇది సాధ్యం’ అంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో ఉన్న ఫోటో.. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుతో దిగిన ఫోటోలను మంత్రి ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
Tammineni: కాంగ్రెస్ నేతలు కాంటాక్ట్ చేయడం.. రేపు ఎల్లుండి అంటున్నారని సీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఐ నేతలు.. రేవంత్ తో మాట్లాడారు అన్నారు.
Tammineni: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సీపీఎం ఆదివారం విడుదల చేసింది. సీపీఎం తొలి జాబితాలో 14 మందికి చోటు దక్కింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇవాళ ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
Janareddy vs Tammineni: సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆదివారంనాడు ఫోన్ చేశారు. పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదలను నిలిపివేయాలని జానారెడ్డి కోరారు.
Bandi Sanjay: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఇంకా పెద్దగా పుంజుకోలేదని తెలుస్తోంది.
CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో స్థాయికి చేరుకున్నాయి. నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి.
సీపీఎం బాటలోనే సీపీఐ కూడా వెళ్లే అవకాశముంది. ఇవాళ జరగనున్న సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశంలో కాంగ్రెస్‌తో పొత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. సీపీఐకి కొత్తగూడెం సీటు ఆఫర్ చేసింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్‌ను నమ్మలేమంటున్నారు సీపీఐ నేతలు. మరోవైపు, కాంగ్రెస్‌తో కలిసి సీపీఐ పోటీ చేస్తే.. అక్కడ తమ అభ్యర్థిని పోటీకి పెట్టబోమని సీపీఎం తెలిపింది. అలాగే వామపక్షాలు పోటీ లేని స్థానాల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని ప్రకటించింది సీపీఎం.
Postal Vote: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. శుక్రవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది.
ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 10 వరకు అభ్యర్థులు ప్రతి రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈనెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా.. 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువుగా నిర్ణయించారు. ఇక, ఈనెల 30న పోలింగ్ నిర్వహించనుండగా.. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్, ఎన్నికల ఫలితాల ప్రకటన ఉండనుంది.