తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రానిదీ ఒక్కో కథ. తెలంగాణలో ఆదాయం తగ్గకపోయినా.. అప్పులు పెరుగుతున్నాయి. ఏపీలో ఆదాయం పెరగడం లేదు. అప్పులు పేరుకుపోతున్నాయి. పైగా అప్పులు తీర్చడానికి అప్పులు చేయక తప్పని విష విలయం రెండు రాష్ట్రాల్లో నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారంపై దృష్టి సారించింది కేంద్రం హోంశాఖ.. ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంమత్రిత్వశాఖ లేఖ రాసింది. విభజన సమస్యలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై జనవరి 12న జరగనున్న సమావేశానికి హాజరు కావాలని కోరిన విషయం తెలిసింది.. అందులో భాగంగా ఇవాళ ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమావేశం కానున్నారు. మొదట ఢిల్లీలో ప్రత్యక్షంగా ఈ సమావేశం…
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. రేపు నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. తెలంగాణలో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనచారి, రవీందర్‌రావు, ఎల్. రమణ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కోటిరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ రేసులో ముందున్నట్లు ప్రచారం జరగుతోంది. వీరితో పాటు మరికొంత మంది ఆశావహులు ప్రగతి భవన్ చుట్టూ…
మూడు రోజుల క్రితం వరకు తెలంగాణవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కాస్త బ్రేక్ ఇచ్చాయి. అయితే రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే 5 రోజులు ఉరుములు, మెరుపులతో…
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నడుస్తూనే ఉంది… మూడు ఫిర్యాదులు, ఆరు లేఖలు అన్నచందంగా ఈ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది.. తాజాగా, మరో కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి మరో లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ.. ఇక, ఈ సారి లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. సెంట్రల్ వాటర్ కమిషన్ 1981లో బనకచెర్ల వద్ద కేవలం ఒక్క క్రాస్ రెగ్యులేటర్ కు మాత్రమే అనుమతించిందని గుర్తుచేశారు.. ఎస్కేప్ రెగ్యులేటర్ అనేది తరువాతి కాలంలో…