Flash Floods in Sikkim: సిక్కింలో ఆకస్మిక వరదలు సంభవించాయి. మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి లాచెన్ లోయలో గల తీస్తా నది ఉప్పొంగడంతో ఒక్కసారిగా వరదలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయారు. ఈ విషయాన్ని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ వర్షం…