సాధారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అనేది మధ్య వయస్కుల్లోనో లేదా వృద్ధుల్లోనో కనిపించే ఆరోగ్య సమస్య అని మనం భావిస్తుంటాం. కానీ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఇప్పుడు చిన్న వయసు వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఒక 16 ఏళ్ల బాలికకు సంబంధించిన ఉదంతం వైద్య లోకాన్ని విస్మయానికి గురిచేసింది. సాధారణంగా చేసిన హెల్త్ చెకప్‌లో ఆమె కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు బయటపడటం, దానికి గల ప్రధాన…