పంజాబ్, హర్యానా మధ్య గల శంబు దగ్గర నుంచి రైతులు ఢిల్లీకి బయల్దేరారు.. రైతులు ట్రాక్టర్లలో వస్తుండటంతో ట్రాక్టర్ ట్రాలీలను ఢిల్లీలోకి అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసుల పైకి రైతులు రాళ్లు రువ్వాగా.. ఆ తర్వాత పోలీసులు పలుమార్లు టియర్ గ్యాస్ విడుదల చేశారు. టియర్ గ్యాస్ షెల్స్ కారణంగా రైతులు ఒక్కసారి వెనక్కి తగ్గారు.