ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న భారత క్రికెట్ పేరు ‘ఆకిబ్ నబీ’. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన 29 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఆకిబ్.. 2025 రంజీ ట్రోఫీలో చెలరేగుతున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. ఆకిబ్ తన పేస్ బౌలింగ్‌తో స్టార్ బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అసాధారణ వేగంతో బంతులేస్తున్న ఆకిబ్ పేరు ఇప్పుడు నెట్టింట చర్చకు దారి తీసింది. దేశవాళీ క్రికెట్ నుంచి మరో పేస్ బౌలింగ్ సంచలనం…