ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకొని పోయింది అని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. జనసేన ఎన్డీయే జట్టులో టెక్నికల్ గా మాత్రమే ఉంది.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన పొత్తులతో ఎన్నికలకు వెళ్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు.
పేదల ద్రోహి జగన్‌కి ఐదు కోట్ల జనానికి మధ్య యుద్ధం అంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తన అవలక్షణాలు ఎదుటి వారికి అంటగట్టి చెప్పిన అబద్దమే వందసార్లు చెప్పడం జగన్ రెడ్డి నైజం.. నాలుగున్నరేళ్లుగా జగన్ రెడ్డి కంటికి వైసీపీ ప్రజా ప్రతినిధులు కనిపించ లేదు.. తాడేపల్లి ప్యాలెస్‌లోకి వారికి అనుమతి లేదు.. పంచాయతీల నిధులు రూ.8,600 కోట్లు దారి మళ్లింపును ప్రశ్నించిన వైసీపీ సర్పంచులపై లాఠీ ఛార్జీ చేయించారు
బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తానని, న్యాయపరంగా పోరాడతానని మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. బండారు లాంటి చీడపురుగులను ఏరిపారేయాలంటూ తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను ఒకమాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలని ఆమె అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం అత్యంత కీలకంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులకు సంబంధించి కోర్టుల్లో ముఖ్యమైన తీర్పులు రేపే వెల్లడికానున్నాయి. విజయవాడ ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు దాఖలు చేసిన పలు పిటిషన్లపై తీర్పులు, విచారణలు రేపే ఉండడం గమనార్హం.
రాష్ట్రంలో 42 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల కోసం రూ.3వేల 700 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లాలో మాట్లాడుతూ.. ఈ నిధులు కేంద్రాలకు ఇచ్చారా అని,.. breaking news, latest news, telugu news, Kakani govardhan Reddy, tdp, ycp