టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని అయ్యన్న ఇంటి వెనుకాల గోడను అధికారులు కూల్చివేశారు. అయితే ఈ ఘటనపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలపై కక్ష సాధింపులో భాగమే కూల్చివేతలని, బీసీలు గళమెత్తకుండా చేసేందుకు జేసీబీలతో వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలోని బీసీలను అణచి వేయడమే ధ్యేయంగా జగన్ పని చేస్తున్నారని,…