దివంగత నందమూరి హరికృష్ణ మూడవ వర్థంతి సందర్భంగా ఏపీలోని ఆయా జిల్లాల టీడీపీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులర్పించారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో హరికృష్ణ చిత్రపటానికి మూలమాల వేసిన టీడీపీ నేతలు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. పార్టీకి, సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలోను హరికృష్ణ వర్థంతి కార్యక్రమం జరగింది. ఈ వర్థంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబుతో పాటు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. హరికృష్ణ…