ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో దేశ రాజధాని పొలిటికల్ లీడర్లతో సందడిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా యువ ఎంపీల కూతుళ్లను ఆప్యాయంగా పలకరిస్తున్నారు. తాజాగా టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన భార్య, కూతురుతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు కుమార్తెకు ప్రధాని మోదీ చాక్లెట్లు ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. కాగా అంతకుముందు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కుమార్తెకు…