సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి హడావిడిగా అరెస్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును శుక్రవారం అర్ధరాత్రి బెయిల్‌పై విడుదల చేశారు. సుమారు 18 గంటల పాటు సీఐడీ పోలీసులు తమ అధీనంలోనే ఉంచుకున్నారు. అనంతరం పోలీసులు విజయవాడ కోర్టుకు తరలించారు. సీఐడీ కోర్టు ఇంఛార్జి న్యాయమూర్తి సత్యవతి బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో అశోక్‌బాబును పోలీసులు విడుదల చేశారు. ఆయనకు రూ.20వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుతో సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు…
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును గురువారం అర్ధరాత్రి సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసిన సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్టు తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ మేరకు అశోక్‌బాబు ఇంటికి సీఐడీ సీఐ పెద్దిరాజు నోటీసు అంటించారు. అశోక్‌బాబుపై గతంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో 477(ఎ), 466, 467, 468,…