ఆ జిల్లాలో టీడీపీ సీనియర్స్ అయోమయంలో ఉన్నారా? మింగలేక, కక్కలేక సతమతం అవుతున్నారా? ఫ్రస్ట్రేషన్‌లో కొంతమంది పక్క చూపులు కూడా చూస్తున్నారన్నది నిజమేనా? అసలేంటి వాళ్ళకొచ్చిన సమస్య? అధికార పార్టీలో ఉండి కూడా మారిపోవాలనే ఆలోచన వచ్చేంత తీవ్రమైన పరిస్థితులు ఏమున్నాయి? అసలు ఏ జిల్లాలో ఉందా వాతావరణం?. పార్వతీపురం మన్యం జిల్లాలో పసుపు యుద్ధం పీక్స్‌కు చేరుతోంది. కొత్తగా ఏర్పడ్డ ఈ జిల్లా టీడీపీలో వర్గ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయని పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. ఇక్కడ…