కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. పోరాటమే మన ఊపిరి.. ఎన్టీఆర్ కు మనం అందించే నివాళి అదే అన్నారు ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బాలకృష్ణ. ఏ మహూర్తాన ఆ మహానుభావుడు పార్టీని ప్రకటించారో కానీ.. మహూర్తబలం అంత గొప్పది.అందుకే 4 దశాబ్దాలుగా తెలుగునాట పసుపుజెండా సమున్నతంగా రెపరెపలాడుతుంది. 40 ఏళ్లుగా పార్టీ ప్రస్థానం అప్రహతిహతంగా కొనసాగుతోందంటే వేలాదిమంది నాయకులు, లక్షలాది కార్యకర్తలు, కోట్లాది ప్రజల ఆశీస్సులే కారణం. 21ఏళ్లు అధికారంలో ఉండటం, 19ఏళ్లు ప్రతిపక్షంగా…