తెలంగాణలో కమలం పార్టీకి మంచి వాతావరణం ఉందని చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా... అధికారం మాదేనంటూ ఢంకా బజాయిస్తున్నారు. అంత వరకు బాగానే ఉంది. పవర్‌లోకి వస్తామన్న నమ్మకం ఉండటం ఏ పార్టీకైనా మంచిదే. కానీ... పనేమీ చేయకుండా అలా నమ్మేస్తే సరిపోతుందా? క్షేత్ర స్థాయిలో చేయాల్సిన పనులు చేయకుండా మాకు అధికారం వస్తుంది.