అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్-787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదంలో దాదాపు విమానంలో ప్రయాణించిన వారంతా చనిపోయారని సమాచారం వినిపిస్తోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృతుల్లో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. 230 మంది మృతుల్లో 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒకరు కెనడా దేశస్థుడు ఉన్నారు.…