ఇప్పటి వరకు 107 అక్రమ నిర్మాణాలపై చర్యలు, వాటిలో 84 నిర్మాణాల కూల్చివేత, 23 అక్రమ నిర్మాణాలు సీజ్ చేశారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై దాడులు కొనసాగుతున్నాయి.శుక్రవారం నాడు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్, హెచ్ఎండిఎ యంత్రాంగం సంయుక్తంగా సంగారెడ్డి మున్సిపాలిటీ, నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేత కార్యక్రమాలను నిర్వహించాయి. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో నాలుగు(4) అక్రమ నిర్మాణాలను, నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలో రెండు(2) అక్రమ నిర్మాణాలను శుక్రవారం…
హైదరాబాద్ లో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఒక విటుడిని, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా హిల్స్ రోడ్ నంబర్12 లో కొందరు ‘ఎలిగంట్ బ్యూటీ స్పాలూన్, అథర్వ హమామ్ స్పా’ పేర్లతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అయితే ఈ కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి దాడులు జరిపారు.…