Fake Notes : మెహదీపట్నం పోలీసులు, కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ వెస్ట్ జోన్ బృందం సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించి నకిలీ కరెన్సీ తయారీ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఈద్గా గ్రౌండ్స్, ఫస్ట్ లాన్సర్ వద్ద దాడి చేసి మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ₹4.75 లక్షల నకిలీ ₹500 నోట్లను, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక కారు, తొమ్మిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు కస్తూరి…
బండ్ల గూడలో డబల్ బెడ్‌రూమ్‌లు ఇప్పిస్తామని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డబల్ బెడ్ రూమ్ సూపర్ వైజర్‌తో కుమ్మక్కైన మోసగాళ్లు ప్లాట్ బాధితులకు చూపించారు. 40 మంది బాధితులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫిక్స్ యాప్ ద్వారా సర్టిఫికేట్‌లు తయారు చేసి డబల్ బెడ్ రూమ్ మంజూరు అయినట్లు సర్టిఫికేట్ క్రియేట్ చేశారు.
HYD: పాతబస్తీలో భారీగా నిషేధిత చైనా మాంజాను పట్టుకున్నారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాతబస్తీలోని పతంగుల విక్రయ షాపుల్లో సోదాలు నిర్వహించి.. టాస్క్‌ఫోర్స్, పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేశారు. చైనా మాంజా విక్రయదారులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే.. సంక్రాంతి వేళ నిషేధిత చైనీస్ సింథటిక్ మాంజా విస్తృతంగా వినియోగం అవుతోంది. ఈ మాంజా రోడ్లపై, చెట్లపై తెగిపడి వాహనదారులకు ప్రమాదకరంగా మారగా, పక్షుల ప్రాణాలను సైతం హరిస్తోంది.…