టాలీవుడ్‌లో విభిన్నమైన కథలతో వచ్చే సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. ఆ కోవలోనే పూర్తిస్థాయి వినోదభరిత కథాంశంతో వస్తోన్న “క్రేజీ కల్యాణం” చిత్రానికి సంబంధించిన టైటిల్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యారో సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న “క్రేజీ కల్యాణం” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తుండగా బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు. ఒక పెళ్లి…
టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్ మరోసారి నటుడిగా లీడ్ రోల్‌లో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. జనవరి 23న రిపబ్లిక్ డే వీకెండ్‌లో సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ టీజర్‌లోని కథ, అహంకారం, స్వార్థపూరిత స్వభావం గల ధనవంతుడైన చేపల వ్యాపారి అంబటి ఓంకార్ నాయుడు చుట్టూ తిరుగుతుంది.…
‘పెళ్ళిచూపులు’ సినిమాతో టాలీవుడ్‌ల్లో సెన్సేషన్ క్రియేట్ చేసి, ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. తన రెండో చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’ థియేటర్లలో అనుకున్నంతగా ఆడినప్పటికి.. ఓటీటీలో, టీవీలో ఈ సినిమాను జనం బాగానే చూశారు. కాల క్రమంలో దానికి కల్ట్ స్టేటస్ వచ్చింది. గత ఏడాది ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూశారు. థియేటర్లలో సెలబ్రేషన్స్ చూసి అందరూ షాకయ్యారు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి,…