భారత్‌పై సుంకాల పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వరాన్ని మరింత పెంచారు. రానున్న 24 గంటల్లో భారత్‌పై సుంకాలను గణనీయంగా పెంచుతామని ఓ అంతర్జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సుంకాల పెంపు అంశంపై తాజాగా ఆర్బీఐ గవర్నర్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన సుంకాలు మన ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపవని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ షరతులు వర్తిస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…