ఒక్కోసారి చిన్నచిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. కొంతమంది దేవాలయాలకు చందాలు, విరాళాలు ఇస్తుంటారు. ఒక వ్యక్తి ఇచ్చిన విరాళం తక్కువే అయినా, కోట్లలో విరాళం ఇచ్చినట్టు దేవస్థానం రికార్డుల్లో నమోదైంది. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి శ్రీవారి నిత్య అన్నదానం ట్రస్టుకు. రూ. 2116 చెల్లించాడో భక్తుడు. కానీ రూ 8.కోట్లకు పైగా ఇచ్చినట్టు ఆన్ లైన్లో ఎంటర్ చేశాడో ఉద్యోగి. ఆ తప్పు సరిదిద్దుకునేందుకు ఆలయ అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. ఏలూరు జిల్లా…