టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వచ్చే ఎన్నికల్లో తాను తాండూరు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు.. పార్టీ నాకే టిక్కెట్ ఇస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. అంతేకాదు.. తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఐదేళ్లు పదవిలో ఉంటారని.. నాలుగేళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టినా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు..…