జీవితంలో అనుకున్నవన్నీ జరగవు. కానీ కొన్ని అవకాశాలు అనుకోని వరంలా వచ్చిపడతాయి. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన 21 ఏళ్ల సాయినికేష్ రవిచంద్రన్ విషయంలో కూడా అదే జరిగింది. సాయినికేష్ ఇండియన్ ఆర్మీలో చేరాలనుకున్నాడు. రెండు సార్లు ప్రయత్నించాడు. కానీ రెండు సార్లూ విఫలమయ్యాడు. తరువాత అమెరికా సైన్యంలో అయినా చేరుదామనుకుని చెన్నయ్‌లోని అమెరికన్ కాన్సులేట్‌ని సంప్రదించాడు. అక్కడా అతనికి నిరాశే ఎదురైంది. దాంతో అతడు పై చదువుల కోసం 2018లో ఉక్రెయిన్ వెళ్లాడు. అక్కడి నేషనల్ ఏరో…