SIR: కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల ప్రక్షాళన కోసం చేపట్టిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ తమిళనాడులో నకిలీ ఓటర్లపై పంజా విసిరింది. తమిళనాడులో సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితా ఈరోజు(డిసెంబర్ 19)న విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 97 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. ఇందులో మరణించిన వారు 6,94,672 మంది, వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు 66,44,881 మంది, ఒకే వ్యక్తికి అనేక చోట్ల ఓటు ఉన్నవారు 3,39,278 మంది ఓటర్లు ఉన్నారని డేటా పేర్కొంది. Read…