Home
Tamil Nadu Assembly
Tamil Nadu Assembly News
-
CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు
CM Vijay vs MK Stalin: తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ తనను ఉద్దేశించి MISA (మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్) ప్రస్తావన చేయడంపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీని అనవసర వివాదాలకు వేదికగా మార్చొద్దని సీఎం విజయ్‌కు సూచించారు. సోషల్ మీడియా రీల్స్, ప్రచార కార్యక్రమాలతో పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విజయ్‌పై స్టాలిన్ ఆరోపణలు… -
CM Vijay: పోలీసులు పవర్ సెంటర్‌గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
CM Vijay: తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు సోమవారం వాడివేడిగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస హత్యలు, శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించాలని డీఎంకే సభ్యులు నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్.. రాష్ట్రంలో పోలీసుల పాత్ర, నేరాల నియంత్రణ, డ్రగ్స్‌పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించే వ్యవస్థగా ఉండాలే తప్ప.. ప్రత్యేకమైన అధికార కేంద్రంగా మారకూడదని సీఎం విజయ్ స్పష్టం… -
Tamil Nadu CM Vijay: సీఎం విజయ్ భారీ ప్యాకేజీ.. ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, రూ.1 లక్ష భత్యం, రూ.25 లక్షల ఆరోగ్య బీమా
Tamil Nadu CM Vijay Announces Big Package: తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ బుధవారం పలు కీలక ప్రకటనలు చేశారు. ఎమ్మెల్యేల నియోజకవర్గ పర్యటనలకు ప్రభుత్వ వాహనాలు, డ్రైవర్ల జీతాలు, వాహన నిర్వహణకు నెలవారీ భత్యం, ఎమ్మెల్యేల కార్యాలయాల్లో సహాయకులను నియమించుకునేందుకు ప్రత్యేక నిధులు, ప్రజలకు ఆరోగ్య బీమా పరిమితి పెంపు వంటి పలు నిర్ణయాలను ప్రకటించారు. ఎమ్మెల్యేలు తరచుగా తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకోవాల్సి ఉంటుందని సీఎం విజయ్… -
Udhayanidhi Stalin Arrest: నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
Udhayanidhi Stalin Arrest: తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అసెంబ్లీలో కావేరీ నీటి వివాదంపై ముఖ్యమంత్రి విజయ్ను టార్గెట్ చేస్తూ ఉదయనిధి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో నటి త్రిషను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఈ అంశంలో ప్రతిపక్ష నేతలపై కేసు నమోదైంది. కేసు నమోదైన కొన్ని గంటల్లోనే చెన్నైలోని ఆయన నివాసం వద్దకు చేరుకున్న పోలీసుల బృందం ఆయనను అరెస్ట్ చేశారు. కాగా, అరెస్టు భయంతో… -
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
AIADMK MLA Resignation: తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకేకు మరో భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ సోమవారం తమిళనాడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు పార్టీకి కూడా గుడ్‌బై చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏఐఏడీఎంకేను వీడిన ఆరో ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు. ఈ పరిణామం పార్టీ అధినేత పళనిస్వామికి మరింత ఇబ్బందికరంగా మారింది. జయలలిత మంత్రివర్గంలో కీలక బాధ్యతలు ఎంఆర్ విజయభాస్కర్ మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత… -
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి హీట్ పుట్టింది.. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసే అవకాశం లేదని, మూడు నుంచి ఆరు నెలల్లోనే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి రావచ్చని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఒక కార్యక్రమంలో మాట్లాడిన స్టాలిన్.. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం పూర్తి మెజారిటీతో… -
Tamil Nadu Politics: వరుస ఎదురుదెబ్బలు.. అన్నాడీఎంకే నుంచి మరో ఎమ్మెల్యే ఔట్
Tamil Nadu Politics: తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సి. విజయభాస్కర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. విజయభాస్కర్ తన రాజీనామా పత్రాన్ని లిఖితపూర్వకంగా తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం. అప్పావుకు సమర్పించారు.. ఆయన రాజీనామాతో అన్నాడీఎంకేలో రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో విరాలిమలై నియోజకవర్గం నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం… -
MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
MK Stalin: డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్, కొత్తగా ఏర్పడిన సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయ్ సాధించిన విజయాన్ని రాజకీయ సునామీ కాదని, సినిమా సునామీ అని అభివర్ణించారు. కొన్ని రోజుల తర్వాత ప్రజల్లో ఈ ఉత్సాహం తగ్గి మళ్లీ డీఎంకే వైపు చూస్తారని అన్నారు. విజయ్ ప్రభుత్వం 5 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేదని చెప్పారు. తమ అభిమాన నటుడు పార్రటీ ప్రారంభించడం వల్లే విజయ్‌కి… -
CM Vijay: సీఎం విజయ్‌కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మరో పెద్ద షాక్ తగిలింది. ప్రభుత్వ విశ్వాస పరీక్షలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిల్లో విశ్వాస పరీక్ష సమయంలో ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపించి మద్దతు కూడగట్టారని ఆరోపించారు. ముఖ్యంగా మైనారిటీలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తే కీలక పదవులు, ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామని ఆశ చూపినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ… -
AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్‌కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
AIADMK: తమిళనాడులో రాజకీయ ట్విస్టులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, సీఎం విజయ్‌కు మద్దతు ప్రకటించిన నేతలపై అన్నాడీఎంకే యాక్షన్ మొదలుపెట్టింది. పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిన నేతలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అన్నాడీఎంకే అధినేత పళనిస్వామిని ధిక్కరించి, సుమారు 25 మంది ఎమ్మెల్యేలు బలపరీక్షల్లో విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. Read Also: Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..…
తాజావార్తలు
-
Poco X8s: 12GB RAM, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో Poco X8s? లీకైన వివరాలు ఇవే!
-
Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
-
Ferrari Luce: భారత్‌లోకి ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. 2.5 సెకన్లలో 100 km/h స్పీడ్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!