Tamil Nadu Politics: వరుస ఎదురుదెబ్బలు.. అన్నాడీఎంకే నుంచి మరో ఎమ్మెల్యే ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Politics: తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సి. విజయభాస్కర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. విజయభాస్కర్ తన రాజీనామా పత్రాన్ని లిఖితపూర్వకంగా తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం. అప్పావుకు సమర్పించారు.. ఆయన రాజీనామాతో అన్నాడీఎంకేలో రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో విరాలిమలై నియోజకవర్గం నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విజయభాస్కర్, పార్టీ కీలక నేతగా గుర్తింపు పొందారు. అంతకుముందు అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇటీవలి కాలంలో అన్నాడీఎంకేలో అంతర్గత రాజకీయాలు, నాయకత్వ మార్పుల నేపథ్యంలో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో విజయభాస్కర్ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
- Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
విజయభాస్కర్ రాజీనామాతో ఇప్పటివరకు అన్నాడీఎంకేకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసినట్లైంది. వరుస రాజీనామాలు పార్టీ భవిష్యత్ వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే విజయభాస్కర్ రాజీనామాకు గల కారణాలపై ఇంకా అధికారికంగా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. కాగా, అన్నా డీఎంకే నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోకుండా కట్టడి చేసేందుకు రెండుగా చీలిన గ్రూపులు ఏకమైనా.. ఈ రాజీనామాల పర్వాన్ని మాత్రం ఆపలేకపోతున్నాయి.. సీఎం విజయ్ శాసన సభలో తన బలాన్ని నిరూపించుకున్న తర్వాత ఎమ్మెల్యేల వరుస రాజీనామాలు.. ఆ తర్వాత టీవీకేలో చేరడం అన్నా డీఎంకేను కలవరపెడుతున్నాయి..
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
-
Series Rankings: ముగిసిన వెస్టిండీస్ సిరీస్.. మారిన ర్యాంకులు.. టాప్‌లో శ్రేయస్ అయ్యర్..
-
Sanju Samson: అప్పుడే ఆత్మవిశ్వాసం పెరిగింది.. భయం లేకుండా క్రికెట్ ఆడుతా.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!