Afghanistan: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు నెమ్మదిగా బలపడుతున్నాయి. ఇటీవల, ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో కొన్ని రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. అయితే, ఈ పరిణామాలను పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది. భారత్ పర్యటను ముత్తాఖీ వచ్చిన రోజే కాబూల్‌పై వైమానికి దాడికి తెగబడింది.
Pak-Afghan: ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ మధ్య టర్కీలో జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో రెండు దేశాలు మరోసారి యుద్ధానికి దగ్గరగా చేరాయి. చర్చలు విఫలమైనట్లు ఇరు దేశాలు స్టేట్ మీడియా వెల్లడించింది. చర్చలు విఫలమైతే ఆఫ్ఘాన్‌పై దాడులు చేయడం తప్పా వేరే మార్గం లేదని ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.
India-Afghanistan: భారతదేశంలో, ఆఫ్ఘానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ పర్యటిస్తున్నారు. తాలిబాన్లు 2021లో ఆఫ్ఘాన్ అధికారాన్ని చేపట్టిన తర్వాత, భారత్‌లో ఒక తాలిబాన్ మంత్రి పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక రాజకీయాల కారణంగా ఆఫ్ఘాన్‌తో సత్సంబంధాలు భారత్‌కు ఇప్పుడు కీలకం.