US Flight: షాకింగ్ వీడియో.. విమానం గాల్లో ఉండగా ఊడిన టైరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సీన్ చూస్తే.. విమాన ప్రయాణమంటేనే హడలెత్తిపోతారు. ఈ మధ్య విమాన ప్రమాదాలు విరివిగా జరుగుతూనే ఉన్నాయి. అయినా విమాన సంస్థలు అప్రమత్తం కావడం లేదు. తాజాగా జరిగిన ఈ ఘటన మరింత భయాందోళన కల్గిస్తోంది.
విమానం టేకాఫ్ అవుతుంటుండగా దాని చక్రం ఒకటి ఊడి (Tire falls off plane) కిందపడింది. అది కాస్త ఓ కారు మీద పడటంతో ఆ వాహనం నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటన శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
Also Read
అమెరికా (USA)లోని ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ (United Airlines)కు చెందిన ఓ విమానం గాల్లో ఉండగా దాని టైరు (Tire) ఊడిపడింది. అప్రమత్తమైన పైలట్లు వెంటనే దారిమళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777-200 విమానం గురువారం ఉదయం శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి జపాన్‌లోని ఒసాకాకు బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే వెనుక వైపున ల్యాండింగ్ గేర్‌లోని ఓ టైరు ఊడిపోయింది. అది విమానాశ్రయంలోని పార్కింగ్ స్థలంలో ఉన్న కారుపై బలంగా పడింది. దీంతో వాహనం తీవ్రంగా ధ్వంసమైంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
టైరు ఊడిన విషయాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే విమానాన్ని దారిమళ్లించి లాస్‌ఏంజిల్స్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించేశారు. అది సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని.. అందులోని ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపించామని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఘటన సమయంలో విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు.

బోయింగ్ 777 విమానాల్లో రెండు ల్యాండింగ్ గేర్‌లకు ఆరు చొప్పున టైర్లు ఉంటాయి. చక్రాలు ఊడినా, డ్యామేజ్ అయినా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఈ మోడల్‌ను డిజైన్ చేశారు. తాజా ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికులు మాత్రం క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరినట్లు అధికారలు తెలిపారు. మొత్తానికి పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
It seems like we are seeing at least one plane incident a week at this point.
United Airlines Boeing 777 loses tire while taking off crushing multiple cars on the ground
Forced emergency landing after losing one or two tires during takeoff from San Francisco en route to Osaka pic.twitter.com/UIloq7c6nC
— PatriotJuls 1776 (@JRColbert1) March 8, 2024
✈️United flight UA35 diverted to Los Angeles today after losing a wheel on takeoff 🚨 Via @FlightEmergency
View #UA35's data at
https://t.co/F63EfWkMAN pic.twitter.com/0bSSQE6UKu— AirNav Radar (@AirNavRadar) March 7, 2024
తాజావార్తలు
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్‌గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
-
Ola S1Z: భారత్‌లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
-
AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. మిర్జా రహమత్ బేగ్‌పై ఎంఐఎం వేటు..
-
Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
-
CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!