Taiwan: ప్రపంచ వ్యాప్తంగా తైవాన్ అధ్యక్ష ఎన్నికలు ఆసక్తిని పెంచాయి. చైనా, తైవాన్‌ని సొంతం చేసుకోవాలని కుయుక్తులు పన్నుతున్న వేళ, చైనాకు ట్రబుల్ మేకర్‌గా పేరుపొందిన అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) నేత లై చింగ్-తే విజయం సాధించారు. వరసగా మూడో సారి అక్కడి ప్రజలు ఈ పార్టీకే అధికారాన్ని కట్టబెట్టారు. ఈ గెలుపుతో చైనాకు గట్టి దెబ్బతాకినట్లు అయింది. ఎన్నికల సమయంలో లై చింగ్‌ని చైనా ప్రమాదకరమైన వేర్పాటువాదిగా నిందించింది.