భారత్ పర్యటనలో (గోట్ ఇండియా టూర్) భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీకి భారత్, యూఎస్ఏ టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ టికెట్లను ఐసీసీ చైర్మన్ జై షా అందజేశారు. అంతేకాదు భారత క్రికెట్ జట్టు జెర్సీ, బ్యాట్‌ను కూడా బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, డీడీసీఏ అధ్యక్షుడు…
2026 T20 World Cup Ticket Booking: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026కి సంబంధించిన ఫేజ్–1 టికెట్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 11 సాయంత్రం 6.45 గంటల నుంచి అధికారికంగా టికెట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. భారత్‌లో టికెట్ ధరలు కేవలం రూ.100 నుంచి మొదలవుతున్నాయి. శ్రీలంకలో LKR 1000 (సుమారు రూ.270) నుంచి టికెట్ ధరలు మొదలవుతాయి. మొదటి విడతలో 20 లక్షలకు పైగా టికెట్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఫేజ్–2 టికెట్ వివరాలను…