శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంలో మంత్రి పదవులు తీసుకోకుండా రాష్ట్రం కోసం పనిచేసిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఇప్పుడు ఎన్డీఏతో కలిసి పనిచేస్తున్నాం.. టీడీపీ ఎప్పుడు పదవుల కోసం పనిచేయలేదు.. విశ్వసనీయత కోసం పని చేస్తాం అనేది గుర్తించాలన్నారు.