మేడిపల్లి పరిధిలోని బాలాజీ హిల్స్‌లో జరిగిన దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదు నెలల గర్భవతైన స్వాతిని చంపేందుకే.. ఆమె భర్త మహేందర్ రెడ్డి వికారాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతిపై మహేందర్‌కు అనుమానం ఉంది. స్వాతి గర్భవతి అయినప్పటి నుంచి అనుమానం పెంచుకున్నాడు. రెండు నెలల క్రితమే స్వాతిని వికారాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకువచ్చాడు. శనివారం తానుంటున్న ఇంట్లో ఓనర్స్ లేకపోవడంతో.. హత్యకు ప్లాన్ చేశాడు. అనుమానం…