Indore: దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మరోసారి ఇండోర్ నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023 అవార్డుల్లో భాగంగా ఏడోసారి ఇండోర్ మొదటిస్థానంలో నిలిచింది. ఇండోర్, సూరత్ నగరాలు దేశంలో పరిశుభ్రమైన నగరాలుగా ఎంపికయ్యాయి. అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి.