ఒక్క హిట్.. ఒకే ఒక్క హిటే కోసం నాలుగేళ్లుగా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు మ్యాచో స్టార్ గోపీచంద్. సీటీమార్ తర్వాత బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూడలేదు. ఆరడుగుల బుల్లెట్ నుండి రీసెంట్లీ వచ్చిన విశ్వం వరకు వరుసగా ఐదు డిజాస్టర్లను చూశాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని గ్రిప్పింగ్ స్టోరీలపై ఫోకస్ చేశాడు. మొత్తానికి తీసుకున్న గ్యాప్ సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు గోపీ.…