తెలుగునేలపై 'బాలనాగమ్మ కథ' తెలియనివారు అరుదనే చెప్పాలి. ఇప్పటికీ పల్లెటూళ్ళలో మాయలపకీరు వచ్చి బాలనాగమ్మను కుక్కగా మార్చి తీసుకువెళ్ళాడనే కథను చెప్పుకుంటూనే ఉన్నారు. ఎవరైనా మాయ చేసే మాటలు పలికితే, "మాయలపకీరులా ఏం మాటలు నేర్చావురా?" అంటూ ఉంటారు.
సావిత్రి అన్న పేరుకు తెలుగునాట విశేషమైన గుర్తింపు ఉంది. తెలుగు సినిమా పలుకు నేర్చిన తొలి రోజుల్లోనే ‘సతీ సావిత్రి’ పేరు మీద రెండు సినిమాలు జనం ముందు నిలిచాయి. తరువాత మరో 24 ఏళ్ళకు కడారు నాగభూషణం దర్శకత్వంలో ‘సతీ సావిత్రి’ తెరకెక్కింది. ఆ తరువాత యన్టీఆర్ యమధర్మరాజుగా నటించిన ‘సతీసావిత్రి
తెలుగు సినిమా స్వర్ణ యుగాన్ని పరిపుష్ఠి చేసిన మహా నటులలో అగ్రగణ్యులు ఎస్వీ రంగారావు. ఆయన తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల మదిలో చెప్పరాని ఆసక్తి తొణికిసలాడేది… ఎందుకంటే తెర నిండుగా ఉండే ఆ విగ్రహం… నటనలో నిగ్రహం… పాత్రకు తగిన ఆగ్రహం… అనువైన చోట ప్రదర్శించే అనుగ్రహం– అన్నీ రంగారావు నటనలో మెండు�