జపాన్ మొబిలిటీ షో 2025లో సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ కారు విజన్ ఇ-స్కైని ఆవిష్కరించింది. విజన్ ఇ-స్కై ప్రత్యేకంగా నగర వినియోగం కోసం రూపొందించారు. కంపెనీ ప్రకారం, ఈ కాన్సెప్ట్‌ను రాబోయే సంవత్సరాల్లో ప్రొడక్షన్ మోడల్‌గా ప్రారంభించవచ్చు. సుజుకి విజన్ ఇ-స్కై కారు 2026 ఆర్థిక సంవత్సరం నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. విజన్ ఇ-స్కై పరిమాణం జపనీస్ కీ కార్ల మాదిరిగానే ఉంటుంది. దీని పొడవు 3,395mm, వెడల్పు 1,475mm, ఎత్తు 1,625mm.…