అనుమానం పెనుభూతమైంది. దీంతో భార్యను అతి కిరాతకంగా చంపేశాడు ఓ భర్త. తిరుపతి మంగళం బొమ్మల క్వార్టర్స్ లో జరిగిన ఘటన కలకలం సృష్టించింది. ఆ తర్వాత అతడు కూడా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు. బొమ్మల క్వార్టర్స్‌కు చెందిన ఉషకు.. గంగాధర నెల్లూరు మండలం ఠాణాకు చెందిన లోకేశ్వర్‌తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరూ సమీప బంధువులు. ఉషా, లోకేశ్వర్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.…
భార్యాభర్తల మధ్య సంబంధం ప్రేమ, సంఘర్షణతో ముడి పడి ఉంటుంది. ఈ సంబంధం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరి మధ్య అనుమానం తలెత్తితే.. వారి మధ్య దూరం పెరుగుతుంది. లేదా ఘర్షణ వాతావరణం నెలకొంటుంది.