కర్ణాటకలోని బెంగళూరు విమానాశ్రయంలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన ఇథియోపియన్ పౌరుడికి మంకీపాక్స్‌కు బదులుగా చికెన్‌పాక్స్ ఉన్నట్లు నిర్ధారించబడింది. కర్ణాటక ఆరోగ్య మంత్రి కె.సుధాకర్ ప్రకారం.. ఇథియోపియన్ పౌరుడు ఈ నెల ప్రారంభంలో మంకీపాక్స్ లక్షణాలతో బెంగళూరు విమానాశ్రయంలో దిగగా.. అతనిని పరీక్షల కోసం పంపించారు.