బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. గతవేలంలో రాజస్థాన్ ఈ పద్నాలుగేళ్ల పిల్లాడిని కోటి రూపాయలకు దక్కించుకుంది. తొలి మ్యాచ్‌తోనే వైభవ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎదుర్కొన్న మొదటి బంతిని సిక్సర్ కొట్టి తన సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ 34 పరుగులతో సత్తా చాటాడు. ఈ సీజన్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ గుజరాత్ టైటాన్స్‌పై నెలకొల్పాడు. 38 బంతుల్లో 101 పరుగులతో ఊచకోత కోశాడు. తరువాతి రెండు మ్యాచ్‌లలో…