Suryakanta Patil: మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో పేలవమైన పనితీరు కనబరిచిన బీజేపీకి షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి సూర్యకాంత పాటిల్ కాషాయ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. గత 10 ఏళ్లలో తానను చాలా నేర్చుకున్నానని, ఇందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె రాజీనామా తర్వాత అన్నారు.