అభిమానం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుందని చెప్పడానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఎదురైన ఈ ఘటనే నిదర్శనం. తాజాగా సూరత్ ఎయిర్‌పోర్ట్‌లో బిగ్ బిని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆయన తన కారు దగ్గరకు వెళ్తున్న సమయంలో సెల్ఫీల కోసం, షేక్ హ్యాండ్స్ కోసం ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడటంతో అక్కడ తొక్కిసలాట లాంటి వాతావరణం ఏర్పడింది. జనం ఒత్తిడికి తట్టుకోలేక ఎయిర్‌పోర్ట్ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్న ఒక భారీ అద్దం ఒక్కసారిగా…