Kangana ranaut: బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్‌ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. బీజేపీ తరుపున హిమాచల్ ప్రదేశ్ మండి ఎంపీ స్థానం నుంచి పోటీలో నిలబడుతున్న కంగనాపై సోషల్ మీడియా వేదికగా శ్రీనతే అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు.