డిల్లీ – కంచ గచ్చిబౌలి అడవుల నరికివేతపై సుప్రీం కోర్టులో విచారణ. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అడవుల నరికివేతను సుమోటోగా విచారించిన సుప్రీం కోర్ట్. పర్యావరణాన్ని, వన్య ప్రాణులను రక్షించేలా ప్రతిపాదనలు రెడీ చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. గతంలో కంచ గచ్చిబౌలి వ్యవహారంలో సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి కోసం రాత్రికి రాత్రి వందల బుల్డోజర్లతో అడవులను నాశనం చేస్తారా అంటూ సుప్రీం కోర్ట్ మండిపడింది. అంతేకాదు వెంటనే విద్వంసం ఆపేయాలని ఆదేశించింది.…
Harish Rao : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణాన్ని ఎలా అణిచివేస్తుందో, అది ఎంత భయానకంగా, బాధ్యతారాహిత్యంగా సాగుతోందో ఇప్పుడు దేశానికి, ప్రపంచానికి తేటతెల్లమైందని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కంచ గచ్చిబౌలి భూముల అంశంలో సుప్రీం కోర్టులో జరిగిన వాదనలు, ప్రభుత్వ నైపుణ్యానికి బదులుగా నిరంకుశత్వాన్ని ఉద్ఘాటించాయని ఆయన అన్నారు. సెలవు దినాల్లోనూ ప్రభుత్వ యంత్రాంగం బుల్‌డోజర్లతో భూవిధ్వంసానికి పాల్పడడంపై సుప్రీంకోర్టు చేసిన గంభీర వ్యాఖ్యలు, కాంగ్రెస్…