Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్‌పై కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే రెండు వారాల కస్టడీకి అనుమతి ఇచ్చామని గుర్తు చేసిన ధర్మాసనం.. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారు? ఈ కేసులో ఇంకా ఏం మిగిలింది? అంటూ దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది. ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్‌ను పూర్తిచేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.. మీ పర్పస్ పూర్తయిందా? లేదా? మళ్లీ ఆయన్ని జైల్లో పెట్టాలనుకుంటున్నారా?…