జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. త్రిసభ్య కమిటీ దర్యాప్తు నివేదికను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు జడ్జిలతో గతంలో కమిటీ వేసింది.
సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా ఆర్‌జీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ నిరసనల్లో అరెస్టైన ‘పశ్చిమ్ బంగా ఛత్ర సమాజ్’ సంస్థ విద్యార్థి నాయకుడికి ఇటీవల కోల్‌కతా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.